కడియం మండలంలోని కడియపులంక గ్రామదేవత శ్రీ ముసలమ్మ అమ్మవారిని శుక్రవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాలయాల ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షులు శ్రీహరి రాజు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఆలయ అధికారులు ఆయనను సాలువాతో సత్కరించి అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa