నరసన్నపేట మండలంలో సాగునీటి కాలువల్లో పేరుకుపోయిన మొక్కలను తొలగింపు కార్యక్రమాన్ని ఉపాధి పనులలో చురుగ్గా నిర్వహిస్తున్నారు. ఉపాధి పనుల్లో భాగంగా వేతన దారులు కాలువల్లో జంగిల్ తొలగించే పనులు చేస్తున్నారు. మండలంలో ఇప్పటి వరకు 68 కాలువల్లో మొక్కలను తొలగించినట్లు ఏపీఓ యుగంధర్ శుక్రవారం తెలిపారు. వచ్చే ఖరీఫ్ నాటికి నీరు అందే విధంగా అన్ని కాలువలను బాగు చేస్తున్నానున్నారు.