ఏపీ చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్, రాష్ట్ర డీజీపీ, పలువురు ఉన్నతాధికారులతో శుక్రవారం రాత్రి అమరావతిలో ఏపీ టీడీపీ అధ్యక్షుడు, టెక్కలి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఏపీ సీఎంగా నారా చంద్రబాబునాయుడు ప్రమాణస్వీకారం నేపథ్యంలో కీలక సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం ముఖ్యమైన సమావేశంలో అచ్చెన్నాయుడు మాట్లాడారు.