పెద్దవడుగూరు మండలంలోని పలు గ్రామాల్లో శాంతిభద్రతలను డీఐజీ సిమోసి ఆదివారం పర్యవేక్షించారు. ఎన్నికల అనంతరం గ్రామాల్లో ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు ఎలాంటి గొడవలకు పాల్పడకుండా భద్రతా ఏర్పాట్లు, బందోబస్తుపై ఆరాతీశారు. ఈ సందర్భంగా ఆమె స్థానిక పోలీసు స్టేషన్ ను పరిశీలించి దస్త్రాలను తనిఖీ చేశారు. ఎస్సై శ్రీనివాసులును ఫ్యాక్షన్ గ్రామాల జాబితా వివరాలను అడిగి తెలుసుకున్నారు.