కేంద్ర మంత్రిగా నేడు ప్రమాణ స్వీకారం చేయనున్న శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడును ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ఎంపీ రామ్మోహన్ ను వారు కలిసి, శుభాకాంక్షలు తెలిపి అభినందించారు. జిల్లాకు చెందిన వ్యక్తి ఎంపీ రామ్మోహన్ కు కేంద్రమంత్రిగా బీజేపీ ప్రభుత్వం అవకాశం కల్పించడం ఆనందంగా ఉందని అన్నారు.