ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల అరాచక కాండపై పోరాటానికి వైయస్ఆర్సీపీ సిద్ధం అవుతోంది. దాడులకు కౌంటర్ యాక్షన్ ప్లాన్ను రూపొందించుకుంది. అదే సమయంలో కార్యకర్తలకు ధైర్యం చెబుతూనే.. వారి రక్షణ కోసం కార్యాచరణ అనుసరించాలని నిర్ణయించింది. వైయస్ఆర్సీపీ రాష్ట్రంలోని ప్రతి జిల్లాలోనూ లీగల్ టీమ్లను ఏర్పాటు చేస్తోంది. తద్వారా టీడీపీ శ్రేణుల్లో దాడులకు గురైన బాధితులకు న్యాయం చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో తొలుత బాధితుల్ని తీసుకుని జిల్లా ఎస్పీల వద్దకు తీసుకెళ్లారు. అక్కడ ఫిర్యాదు చేయిస్తారు. ఆపై కోర్టులో కూడా దావాలు వేయిస్తారు. ఆ తర్వాత జరిగే ప్రొసీజర్లను లీగల్ టీం చూసుకునేలా వైయస్ఆర్సీపీ ప్రణాళిక రూపొందించింది.