రాజ్‌భవన్‌లో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను ఎన్డీయే కూటమి నేతలు కలిశారు. అచ్చె్న్నాయుడు, పురంధేశ్వరి, నాదెండ్ల మనోహర్ గవర్నర్‌ను కలిసిన వారిలో ఉన్నారు. సభా నాయకుడిగా చంద్రబాబును ఏకగ్రీవంగా ఎన్నుకుంటూ చేసిన తీర్మానాన్ని గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు అందజేశారు. 164 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని, రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని గవర్నర్‌కు లేఖ ఇచ్చారు ఎన్డీయే కూటమి నేతలు. ఈ తీర్మానాన్ని పరిశీలించిన గవర్నర్.. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కూటమి నేతలను ఆహ్వానించారు.