చీరాల పట్టణంలోని వైకుంఠపురంలో కరెంటు సరఫరా గాలిలో దీపంలో మారింది. ఆ ప్రాంతంలోని నాలుగు మున్సిపల్ వార్డుల్లో విద్యుత్ ఎప్పుడు ఉంటుందో, ఎప్పుడు పోతుందో ఎవరూ చెప్పలేరు. కొద్దిపాటి గాలికి చెట్లు ఊగినా రాత్రి పగలు తేడా లేకుండా తమ ప్రాంతంలో మాత్రమే విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నారని స్థానికులు వాపోతున్నారు. ఒకసారి కరెంటు పోతే గంటల తరబడి రాదని, ఫోన్ చేసినా సిబ్బంది కనీసం సమాధానం ఇవ్వరని వారు చెప్పారు.