ప్రకాశం జిల్లా గిద్దలూరు పోలీస్ స్టేషన్ లో శనివారం గిద్దలూరు అర్బన్ సీఐ సోమయ్య మరియు మార్కాపురం డివిజన్ డిఎస్పి బాలసుందర రావు ఆధ్వర్యంలో ముస్లిం మత పెద్దలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈనెల 17వ తేదీన బక్రీద్ పండగను ప్రశాంతంగా జరుపుకోవాలని డి. ఎస్. పి బాల సుందర రావు ముస్లిం మత పెద్దలకు సూచించారు. అలానే గోవద కు పాల్పడకుండా ముస్లిం మత పెద్దలు వ్యవహరించాలని డిఎస్పి వారికి విజ్ఞప్తి చేశారు.