రామగిరి మండలంలోని ముత్యాలంపల్లిలో గురువారం తెల్లవారుజామున 5 గంటల వరకు సప్తమాంకములు పౌరాణిక నాటకాన్ని ఘనంగా ప్రదర్శించినట్లు గ్రామపెద్దలు పేర్కొన్నారు. వారు మాట్లాడుతూ గ్రామంలో ప్రదర్శించిన నాటకంలోని మయసభ, పాన్పుసీను, చింతామణి, బాలనాగమ్మ, గయోపాఖ్యానం, చాకలి తిప్పడు, సత్యహరిశ్చంద్ర తదితర సన్నివేశాలు పలువురిని అలరించినట్లు తెలిపారు. ప్రజలు విరివిగా హాజరై నాటకాన్ని వీక్షించారన్నారు.