వైసీపీ ప్రభుత్వం ప్రమోట్ చేసిన అమూల్ పాల వెల్లువ పథకాన్ని కూటమి ప్రభుత్వం ఆపేసింది. జగనన్న పాల వెల్లువ అనే పథకాన్ని ఆ సంస్థ ప్రయోజనాల కోసమే రూపొందించి సహకార డెయిరీలను జగన ప్రభుత్వం చావుదెబ్బ కొట్టిందన్న విమర్శలున్నాయి. పాడి రైతుల కోసమే ఈ పధకం అంటూ పాలవెల్లువ పథకాన్ని జగన ప్రభుత్వం కొనసాగించింది. ఈ పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరడంతో అమూల్ పాలవెల్లువ పథకాన్ని ఆపేస్తున్నట్లు ప్రభుత్వం బుధవారం ఆదేశాలు జారీ చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa