అంతర్జాతీయ సమాజంలో వస్తున్న మార్పులు, ఉద్యోగ అవకాశాలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఆయా అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. జిల్లాలోని ఎంపిక చేసిన 20 పాఠశాలలు, కేజీబీవీలు, ఏపీ మోడల్ స్కూల్స్, ఒకేషనల్ కోర్సులు కలిగిన జూనియర్ లెక్చరర్లకు గురువారం కొప్పోలలో కెరీర్ ఎడ్యుకేషన్ పై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.