టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు, గుంతకల్లు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్ శుక్రవారం రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తదితరులను విజయవాడలోని మంత్రుల కార్యాలయాలలో మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడాలని హోం మంత్రిని, కల్తీ మద్యం, గంజాయి వంటి వాటిని అరికట్టాలని ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్రను కోరారు.