అనంతపురం జిల్లా, గోరంట్ల మండలంలో నేను బడికి పోతా కార్యక్రమంలో భాగంగా బడిమానేసిన ఇద్దరు పిల్లలను ఎంఈఓ జానరెడ్డెప్ప శుక్రవారం ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు. ఎనుములకొట్టపల్లికి చెందిన లక్ష్మీనారాయణ, శివమ్మ కుమారుడు గంగరాజు గొర్రెలు కాస్తున్నాడు. విషయం తెలుసుకున్న ఎంఈఓ ఉదయమే గ్రామానికెళ్లి గంగరాజు, అతని తల్లిదండ్రులతో మాట్లాడారు. అబ్బాయి చదువుకోవడానికి ఆసక్తికలిగేలా చేస్తూ, విద్య వల్ల కలిగే ప్రయోజనాలను తల్లిదండ్రులకు వివరించారు. వారి అంగీకారం మేరకు గంగరాజు వయస్సు రీత్యా గోరంట్లలోని బాలురున్నతపాఠశాలలతో 7వతరగతిలో చేర్పించారు. అదే గ్రామంలో సంధ్య అనే బాలిక బడిమానేసి ఇంటి పనులకే పరిమితం కావడంతో బంధువులతో చర్చించారు. భర్త మరణంతో నారత్నమ్మ కర్ణాటకలోని బాగేపల్లి హాస్టల్‌లో పనిచేస్తూ, కుమారై సంధ్యను అక్కడే పాఠశాలలో చేర్చింది. అనంతరం బడి మానిపిచింది. స్వగ్రామంలో బంధువుల వద్ద ఉంచింది. తిరిగి బాలిక కర్ణాటక బడిలో తల్లివద్ద ఉంటూ విద్యనభ్యసించేలా చేర్పించినట్లు ఎంఈఓ తెలిపారు. కార్యక్రమంలో సీఆర్పీలు పద్మజ, హరూనబాషా, రవి పాల్గొన్నారు.