ఉద్యోగాలు ఇప్పిస్తామని మాయమాటలు చెప్పే వ్యక్తుల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఏలూరు ఎస్పీ మేరీ ప్రశాంతి జిల్లా ప్రజలకు సూచించారు. నూతన ప్రభుత్వం చేపట్టిన పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమాన్ని సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వ హించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన 50 ఫిర్యాదులను పరిశీలించి సత్వర పరిష్కారానికి ఆదేశాలిచ్చారు.