ఏలూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యుడు చేసిన శస్త్రచికిత్సలు వికటించాయని ఆ వైద్యుడి పై చర్యలు తీసుకోవాలని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ జేసీని కోరారు. పెదవేగి మండలం వేగివాడకు చెందిన చెల్లిమాల నాగరాజు తన కుమారుడికి ప్రమాదం జరిగితే పత్తేబాదలోని ఓ ఆర్థోఫెడిక్ ఆస్పత్రిలో మోకాలికి ఆపరేషన్ చేయించాడని, అలాగే పెదవేగి మండలం గొల్లగూడెంకు చెందిన మాగంటి వెంకటేశ్వరరావుకు చేసిన ఆపరేషన్ కూడా ఫెయిల్ అయిందన్నారు. ఆ ఆస్పత్రి వైద్యుడిపై చర్యలు తీసుకుని పరిహారం ఇప్పించాలని కోరారు. దెందులూరు నియోజకవర్గంలో రైతులకు చెందాల్సిన యంత్ర పరికరాలు విషయంలో కుంభకోణం జరిగిందని, దీనిపై విచారణ చేయాలని పేర్కొన్నారు.తమ కుటుంబానికి చెందిన వ్యవసాయ భూమిని వ్యవసాయ, ఇతర భూమిగా మార్చారని, దీనివల్ల రిజిస్ర్టేషన్‌కు ఇబ్బందులు పడుతున్నామని, ఏలూరుకు చెందిన కర్రి సత్యనారాయణ అర్జీ అందజేశారు.ప్రధానమంత్రి కిసాన్ సొమ్ము జమ కాలేదని తంగిడగూడెంకు చెందిన లక్ష్మయ్య ఫిర్యాదు చేశారు.తనకు ఇప్పటి వరకు పీఎం కిసాన్ యోజన, రైతు భరోసా రాలేదని, ఈ రెండు ఇప్పించాలని పెరికిగూడెంకు చెందిన రైతు నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు.