ప్రజలకు ఎటువంటి సమస్యలు ఉన్నా త్వరిత గతిన పరిష్కరించేలా కూటమి ప్రభుత్వం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసెల్ సిస్టమ్) పేరుతో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో సోమవారం ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ఏలూరు లో ప్రజల నుంచి మొత్తం 150 అర్జీలు స్వీకరించారు. ఉదయం కలెక్టరేట్‌లోని గౌతమి సమావేశ మందిరంలో జేసీ బి.లావణ్య ణితో పాటు డీఆర్వో డి.పుష్ఫమణి, డీఆర్‌డీఏ పీడీ విజయ్ రాజు, డిప్యూటీ కలెక్టర్లు కె.భాస్కర్, ఎం.ముక్కంటి, ఎస్.ఎస్.ఏ ఏపీసీ పి.సోమశేఖర్, ఆర్డీవో ఖాజావలీ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. జేసీ మాట్లాడుతూ ఆర్జీలను నాణ్యత తో పాటు నిర్దేశించిన సమయంలో పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి సోమవారం జిల్లా, మండల కార్యా లయాల్లో ప్రజా ఫిర్యాదులు పరిష్కార వ్యవస్థ నిర్వహిస్తారని తెలిపారు. జడ్పీ సీఈవో కె.వి సుబ్బారావు, విద్యుత్ శాఖ ఎస్‌ఈ సాల్మన్‌రాజు, డీఈవో కె.అబ్రహం పాల్గొన్నారు.