గత ప్రభుత్వ హయాంలో ఎస్వీ యూనివర్సిటీలో తొలగించిన 23 మంది అకడమిక్ కన్సల్టెంట్లు మళ్లీ విధుల్లోకి చేరారు. ఉద్యోగాల నుంచి తొలగించాక వీరంతా న్యాయ స్థానాన్ని ఆశ్రయించారు. విచారించాక వీరిని విధుల్లోకి తీసుకోవాలని రెండేళ్ల క్రితమే వర్సిటీ అధికారులను కోర్టు ఆదేశించింది. అయినా వీరిని విధుల్లోకి తీసుకోకుండా కాలయాపన చేస్తూ వచ్చారు. ఇపుడు రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం ఏర్పడటంతో తొలగించిన ఈ 23 మంది అకడమిక్ కన్సల్టెంట్లను విధుల్లోకి తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను కూడా వర్సిటీ అధికారులు జారీ చేశారు. దీనిపై విధుల్లోకి చేరిన అకడమిక్ కన్సల్టెంట్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉత్తర్వులిచ్చిన అధికారులకు ధన్యవాదాలు తెలియజేశారు.