వచ్చే నెల 1వ తేదీ నుంచి స్టార్ డీలర్లు, ఎందీయూ ఆపరేటర్లు వినియోగదారుల ఇంటి వద్దకే వెళ్ళి నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని ఆర్డీఓ శ్రీనివాసులు రెడ్డి ఆదేశించారు. బుధవారం గుంతకల్లు రెవిన్యూ డివిజన్ కార్యాలయంలో స్టార్ డీలర్లు, ఎండియు ఆపరేటర్లతో ఆర్డీఓ సమావేశం నిర్వహించారు. వచ్చేనెల 1 తేదీ ఉదయం 7 గంటల నుంచే రేషన్ సరఫరా చేయాలని ఆ విధంగా తహసీల్దార్లు, సిఎస్డిటిలు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.