ఏపీ వాతావరణ శాఖ తుఫాను హెచ్చరికల నేపథ్యంలో పాపికొండల విహారయాత్రను నిలిపివేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. నాలుగు రోజుల పాటు యాత్రను నిలిపివేస్తున్నామన్నారు. ఆ తర్వాత పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. తూర్పు కనుమల్లోని దట్టమైన అడవితో కూడిన ఈ పాపికొండల పర్వత శ్రేణి అందాలు ఆకట్టుకుంటాయి. గోదావరిపై లాంచీ ప్రయాణం, జలపాతాలు, గ్రామీణ వాతావరణం పర్యాటకులను ప్రత్యేకంగా ఆకట్టుకుంటుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa