తుఫాన్ ప్రభావంతో అరకులోయ మండల పరిసర ప్రాంతంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో మండలంలోని కొత్తభల్లుగుడ ఘాట్ రోడ్డుపై కొండ చరియలు విరిగి పడ్డాయని గిరిజనులు గురువారం తెలిపారు. దీనితో రాకపోకల సమయంలో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియదని ఆందోళన చెందుతున్నామని ప్రయాణికులు తెలిపారు. సంబంధిత ఆర్అండ్బి అధికారులు స్పందించి విరిగిపడిన బండరాయిలను పూర్తిస్థాయిలో తొలగించాలని గిరిజనులు కోరుతున్నారు.