యువతకు విస్తృత ఉద్యోగ అవకాశాలు కల్పించటమే ధ్యేయంగా కృషి చేస్తున్నట్లు అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తనయుడు, నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్రామ్ తెలిపారు. శనివారం అవనిగడ్డ మండలం రామచంద్రపురం గ్రామానికి చెందిన అంజనాస్ ఫౌండేషన్ చైర్మన్ బచ్చు నవీన్ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ను మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సత్కరించారు. తమ సంస్థ ఆధ్వర్యంలో యువత కోసం జాబ్ మేళా ఏర్పాటు చేయనున్నామన్నారు.