డీసీఎంఎస్ ద్వారా ఎరువులను రైతులకు అందుబాటులో ఉంచేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని కర్నూలు జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య ఆదే శించారు. శుక్రవారం కర్నూలు నగరంలోని డీసీఎంఎస్ కార్యాలయంలో ఆ సంస్థ చైర్‌పర్సన్‌గా జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడతూ..... ప్రస్తుతం ఖరీఫ్ సీజన్లో రైతులు పంటలు సాగు చేసేందుకు సమాయత్తమయ్యారని, వారికి అన్ని రకాలు గా అండగా ఉండాలని, ఎంఆర్పీ ధరలకే అన్ని ఎరువులను అందించేం దుకు చర్యలు తీసుకోవాలని మేనేజర్ రాజేష్‌కు ఆదేశించారు. డీసీఎంఎస్ సిబ్బంది రాజు, డీసీవో రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.