ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దగ్గరుండి భర్తకు మూడో పెళ్లిచేసిన ఇద్దరు భార్యలు.. ఎందుకో తెలుసా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jun 30, 2024, 07:49 PM

భర్త తాగుబోతైనా.. జూదగాడైనా భార్య భరిస్తుంది కానీ.. తనకు పంచాల్సిన ప్రేమను మరొక మహిళకు పంచితే మాత్రం తట్టుకోలేదు. ఎన్ని కష్టాలనైనా ఓర్చుకుంటుంది కానీ.. సవతి పోరును అంగీకరించలేదు. భర్త జీవితంలోకి మరో స్త్రీ ప్రవేశించిదని తెలిస్తే రాజీలేని పోరాటం చేస్తుంది. కానీ, ఓ వ్యక్తికి అతడి ఇద్దరు భార్యలు మూడో పెళ్లి చేయడం గమనార్హం. అతడికి మొదటి వివాహం కాగా.. మొదటి భార్యత సంతానం కలగకపోవడంతో రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆమె ద్వారా ఓ అబ్బాయిని కన్నాడు. 2007లో బాబు పుట్టగా.. ఆమె మళ్లీ గర్బం దాల్చలేదు. అయితే, తనకు రెండో సంతానం కావాలని భర్త ఆశపడటంతో ఆయన ఇద్దరు భార్యలు మూడో పెళ్లి చేసి ఆయన కోరికను తీర్చారు.


విచిత్రమైన ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. పెదబయలు మండలంలో కించూడు గ్రామానికి చెందిన పండన్న అనే వ్యక్తి ఇది వరకే రెండు వివాహాలు వివాహాలు. తొలుత పార్వతమ్మ అనే మహిళతో వివాహం కాగా ఆమెకు సంతానం కలగలేదు. పిల్లలు పుట్టలేదనే కారణంతో అప్పలమ్మ అనే మరో మహిళను పండన్న మనువాడాడు. ఈ దంపతులకు 2007లో ఒక బాబు పుట్టగా... ఆ తర్వాత అప్పలమ్మ మళ్లీ తల్లి కాలేదు. కానీ, తనకు ఇంకో సంతానం కావాలని భర్త కోరడంతో అతడి ఇద్దరు భార్యలు స్వయంగా పెళ్లి జరిపించారు.


లావణ్య అనే అమ్మాయిని చూసి సంబంధం ఖాయం చేశారు. వివాహానికి ఆహ్వాన పత్రికలను వేయించి.. భర్తకు మూడో పెళ్లి చేశారు. పెళ్లికి పెద్దలుగా ఇద్దరు భార్యలు వ్యవహరించి.. అంగరంగ వైభవంగా జూన్ 25న వివాహం జరిపించారు. ప్రస్తుతం ఈ వివాహానికి సంబంధించిన ఆహ్వాన పత్రిక సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పెళ్లి పత్రికలో వధూవరుల ఫోటోతో పాటు తమ ఫోటోలను కూడా ఇరువురు భార్యలు వేయించడం గమనార్హం. అంతా తామై భర్తకు మూడో వివాహం చేసిన ఈ ఇద్దరు భార్యలది గొప్ప మనసుని కొనియాడుతున్నారు. సతీ సుమతి తన భర్త కోసం వేశ్యను తీసుకొచ్చినట్టు పురాణాల్లో మాత్రమే చదువుకున్నామని, ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నామని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com