ఆంధ్రప్రదేశ్‌లో గత వైసీపీ ప్రభుత్వంలో పెన్షన్ నగదు వెయ్యి రూపాయలు పెంచడానికి నాలుగేళ్లు పట్టిందని, కానీ ఎన్డీయే ప్రభుత్వంలో గెలిచిన నెలలోనే ఇచ్చిన మాటకి కట్టుబడి రూ.4వేలు ఇస్తున్నట్లు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. సింహాచలం మండలం అడవివరంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇవాళ(సోమవారం) పెన్షన్ల పంపిణీ అనేది రాష్ట్రవ్యాప్తంగా పండగ వాతావరణంలా జరుగుతోందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఉదయం 6గంటల నుంచే ప్రతి ఇంటికీ వెళ్లి నగదు ఇస్తున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa