రేపల్లె మండలంలో డయేరియా రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఎంపీడీవో శ్రీనివాసులు రెడ్డి పేర్కొన్నారు. నల్లురిపాలెం గ్రామంలో సోమవారం స్టాప్ డయేరియా క్యాంపెయిన్ ప్రారంభించిన అనంతరం ఎంపీడీవో మాట్లాడారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జూలై 1 నుండి మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలలో “స్టాప్ డయేరియా క్యాంపెయిన్" ప్రారంభించడం జరిగింది అన్నారు. స్టాప్ డయేరియాపై ప్రజల్లో చైతన్యం తెస్తున్నామని తెలిపారు.