ప్రభుత్వ పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న ఆయాలు మంగళవారం ఆందోళనకు దిగారు. ఏఐటియుసి ఆధ్వర్యంలో వారు చీరాల ఎంఈఓ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. తమకు రావలసిన నాలుగు నెలల జీతబకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. తమ జీతాన్ని 21 వేల రూపాయలకు పెంచాలని, గుర్తింపు కార్డులు ఇవ్వాలని, ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలని కూడా వారు కోరారు. ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.