బ్రహ్మంగారిమఠం మండల పరిధిలోని ఈశ్వరమ్మ గృహ సమీపంలో గల అటవీ ప్రాంతంలో సోమవారం ఓ గుర్తు తెలియని మగ శవం లభ్యమయింది. మృతునికి 40 నుండి 45 సం. మధ్యలో ఉంటుందని, ముఖభాగం గుర్తు పట్టలేని విధంగా పాడైపోయింది. శవం కాలిన ఆనవాళ్లు కనిపించడంతో ఎవరైనా నిప్పుంటించి వెళ్లారా అని అనుమానాలు వస్తున్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.