అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచే రాష్ట్రంలో టీడీపీ చేస్తున్న అరాచకాలపై కోర్టులకు వెళ్తామని వైయస్ఆర్‌సీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ స్పష్టం చేశారు. టీడీపీ నేతలు పాల్పడుతున్న అల్లర్లు, దాడులు చిన్నాచితకవి కాదని, కొట్టి చంపడం, కొట్టడం వ్యక్తిగత దూషణలకు పాల్పడి, ప్రభుత్వ, ప్రయివేటు ఆస్తులను ధ్వంసం చేయడం దారుణమన్నారు. అధికార మదంతో ఇష్టానుసారం వ్యవహరిస్తే ప్రజల్లో తిరుగుబాటు వస్తుందని తెలిపారు. రాష్ట్రంలో ఇన్ని దారుణాలు జరుగుతున్నా సీఎం చంద్రబాబు మౌనంగా ఉన్నారని, ప్రజలకిచ్చిన హామీలు మరిచి ప్రతిపక్షాలపై కక్ష తీర్చుకునే పనిలో నిమగ్నమయ్యారని దుయ్యబట్టారు.