జులై 4న దేశవ్యాప్తంగా జరిగే విద్యాసంస్థల బందును జయప్రదం చేయాలని ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఏ, డి పి ఎస్ యు, ఎన్ఎస్ యు వై విద్యార్థి సంఘం నాయకులు గోడ పత్రికలను విడుదల చేశారు. మంగళవారం పుట్టపర్తిలో ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు పవన్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు వీరేష్ తదితరులు నీట్ స్కామ్ పై సమగ్ర దర్యాప్తు నిర్వహించి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.