కళ్యాణదుర్గం పట్టణం బళ్లారి రోడ్డులోని కాలనీకి బసవేశ్వరనగర్ గా నామకరణం చేసి అక్కడ ఆర్చ్ వద్ద జగద్గురు శ్రీ బసవేశ్వర విగ్రహాన్ని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు, బీజేపీ నేత కాపు రామచంద్రా రెడ్డి గురువారం ఆవిష్కరించారు. కరణం పంపన్న కుమారుడు కరణం రామకృష్ణ వారి కుటుంబ సభ్యులు జగద్గురు బసవేశ్వర విగ్రహం చేయించారు. ఈ కార్యక్రమానికి విరక్తి గవిమఠం పీఠాధిపతి కల్యాణస్వామిలు పాల్గొన్నారు.