అనారోగ్యంతో ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన ప్రజలకు సకాలంలో వైద్య సేవలు అందించాలని ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి వైద్యులకు తెలిపారు. డోన్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిని ఆయన తనిఖీ చేసి, రోగులతో మాట్లాడి హాస్పిటల్ సౌకర్యాలను తెలుసుకున్నారు. అలాగే పాతపేటలోని ఆసుపత్రిని తనిఖీ చేసి ఆయుర్వేదం, చిన్నపిల్లల డాక్టర్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు.