సీనియర్ జర్నలిస్టు గారపాటి ఉపేంద్రబాబు (86) అనారోగ్యంతో కన్నుమూశారు. గతంలో ఆంధ్రజ్యోతి డిప్యూటీ ఎడిటర్‌గా ఉపేంద్రబాబు పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు అధ్యక్షుడిగా రెండు సార్లు పని చేశారు. అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. విజయవాడకు సమీపంలోని కాసరనేని వారి పాలెంలో ఈ రోజు ఉపేంద్రబాబు అంత్యక్రియలు జరగనున్నాయి. ఉపేంద్రబాబు మరణం పట్ల పలు జర్నలిస్టు సంఘాలు సంతాపం వ్యక్తం చేశాయి. తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డి, ఏపీయూడబ్ల్యూజే నేత ఐవీ సుబ్బారావు తదితరులు సంతాపం తెలిపారు.