ప్రకాశం జిల్లా పెద్దారవిడు మండలం కుంటలోని పలు ఎరువుల దుకాణాలను డీడీఏ రామ్మోహన్, ఏఓ బుజ్జిబాయి లు గురువారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. సరైన పత్రాలు లేని 73 వేలు విలువ కలిగిన విత్తనాలను నిలుపుదల చేసినట్లు వారు తెలిపారు. స్టాకు సంబంధించి ప్రతిదీ బిల్లులు, రిజిస్టర్ మెయింటైన్ చేయాలని సూచించారు. రైతులకు తప్పనిసరిగా బిల్లులు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు.