కదిరి ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్ ఆదేశాల మేరకు 6వార్డ్ లోని దీర్ఘ కాలంగా ఉన్న వీధి దీపాల సమస్యను పరిష్కరించారు. గురువారం 6 వార్డ్ లో అమీన్ నగర్, న్యూ అమీన్ నగర్, శ్రీ రామ్ నగర్ ల లో స్ట్రీట్ లైట్ లు వెలగలేదు అని వార్డ్ ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తేవడంతో 6వార్డ్ ఇంచార్జీ జి. చైతన్య సమస్య పరిష్కరించారు. బూత్ అధ్యక్షులు చల్ల శ్రీనివాసులు, ఈశ్వరయ్య పాల్గొన్నారు. ఎమ్మెల్యేకు వార్డ్ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.