రాజమండ్రి రూరల్ మండల పరిధిలోని ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ నుంచి శుక్రవారం 11, 920 క్యూసెక్కుల సాగునీటిని విడుదల చేశామని జలవనరులశాఖ అధికారులు తెలిపారు. తూర్పు, మధ్య, పశ్చిమ డెల్టాలకు 3000, 2420, 6500 క్యూసెక్కుల నీటిని విడుదల చేయగా. కాటన్ బ్యారేజీ వద్ద 10. 90 అడుగుల నీటిమట్టం కొనసాగుతుందని తెలిపారు. 28, 283 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేశామన్నారు.