వేతనాల పెంపు అంగన్వాడీల బలోపేతంతో పాటు పలు డిమాండ్లను ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ & హెల్పర్స్ యూనియన్ నాయకులు ఎమ్మెల్యే పరిటాల సునీతకు విజ్ఞప్తి చేశారు. అనంతపురం క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఆమెను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. బీజేపీ ప్రభుత్వం అంగన్వాడీలకు వేతనాలు పెంచుతాము, ఐసీడీఎస్ను బలోపేతం చేస్తామన్న హామీలు నేటికి నెరవేర్చలేదన్నారు.