ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి అన్ని రకాల సేవలు అందించాలనే దృఢ సంకల్పంతో ప్రతిష్టాత్మకంగా సచివాలయ వ్యవస్థను ప్రవేశ పెట్టడం జరిగిందని కనిగిరి మున్సిపల్ ఛైర్ మెన్ అబ్దుల్ గఫార్ అన్నారు. శనివారం కనిగిరిలోని 9వ సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసినారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సచివాలయ సిబ్బంది సమయపాలన పాటించి, ప్రజలకు అందుబాటులో ఉండి ప్రభుత్వ పథకాలలో జాప్యం లేకుండా చూడాలన్నారు.