శ్రీసత్యసాయి జిల్లా మడకశిర పట్టణంలో సోమవారం యుటిఎఫ్ ఉపాధ్యాయ సంఘం నాయకులు సమావేశం నిర్వహించారు. యుటిఎఫ్ జిల్లా అధ్యక్షుడు భూతన్న మాట్లాడుతూ గత ప్రభుత్వంలో విద్యార్థులను విద్యకు దూరం చేయాలంటే ధోరణిలో ఉపాధ్యాయులను ఒత్తిడికి గురిచేయాలని 117 జీవో ని తెచ్చి ప్రభుత్వం బడులు పతనానికి నాంది పలకడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 117 జీవో రద్దుచేసి ప్రభుత్వ బడులకు ప్రాణం పోయాలని కోరారు.