రైతులకు అన్నదాత పథకం ద్వారా ఏడాదికి రూ. 20 వేలు ఇస్తానన్న టీడీపీ ప్రభుత్వ హామీ ఏమైందని వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పురుషోత్తం రెడ్డి, వైసీపీ మండల కన్వీనర్ రామ్మోహన్ రెడ్డి, రోడ్డు అభివృద్ధి కార్పోరేషన్ మాజీ డైరెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి ప్రశ్నించారు. సోమవారం పెద్దకడుబూరులో వైఎస్ఆర్ జయంతి వేడుకల సందర్భంగా వారు మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ మొదలైందని పెట్టుబడి సాయం కోసం రైతన్నలు ఎదురు చూస్తున్నారన్నారు.