కర్నాటక రాష్ట్రంలోని నవబృందావన గడ్డపై వెలిసిన శ్రీ పద్మనాభ తీర్థల బృందావనంతోపాటు నవబృందావనాలకు మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంకు నిత్య పూజలు నిర్వహించేందుకు కర్నాటక హైకోర్టు చారిత్రాత్మక తీర్పును వెల్లడించింది. సోమవారం మంత్రాలయం పీఠాధిపతి శ్రీ సుబుధేంద్ర తీర్థలు ఆధ్వర్యంలో నంజనగూడు శ్రీ రాఘవేంద్రస్వామి మఠం, అనెగొంది దగ్గర నుంచి నవబృందావన గడ్డ వరకు శ్రీ మఠం శిష్యులు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు.