అద్దంకి పట్టణంలో, నామ్ హైవే లో నిబంధనకు విరుద్ధంగా రోడ్డుకు అడ్డంగా వాహనాలను నిలుపుదల చేస్తున్నారు. సోమవారం స్థానిక భవాని సెంటర్ కూడలి నందు ప్రభుత్వ మద్యం దుకాణం వద్ద మద్యం దిగుమతి చేసే వాహనాన్ని రహదారికి అడ్డంగా నిలిపివేయడంతో కొద్దిసేపు ప్రయాణికులు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నిత్యం ప్రజలతో రద్దీగా ఉండే ఈ మార్గంలో అధికారుల పర్యవేక్షణ లోపించిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.