అద్దంకి పట్టణంలో కొత్తగా నిర్మించనున్న 2 విద్యుత్ ఉప కేంద్రాలకు అవసరమైన స్థలాన్ని సోమవారం అధికారులు మంజూరు చేశారు. పట్టణానికి సమీపంలో సింగరకొండ రోడ్డులో టిడ్కో ఇళ్లకు ఉత్తరాన 50 సెంట్లు స్థలాన్ని అదే విధంగా గరటయ్య కాలనీకి తూర్పు వైపున మరో 50 సెంట్ల స్థలాన్ని ఉప కేంద్రం ఏర్పాటుకు కేటాయించినట్లు అధికారులు తెలియజేశారు. ఈ 2 ఉప కేంద్రాల ఏర్పాటుతో పట్టణానికి విద్యుత్ సమస్యలు ఉండవని అధికారులు సోమవారం తెలియజేశారు.