సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుని చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే ఎన్.ఆర్. జయదేవనాయుడు రూ.50లక్షలు పోగొట్టుకున్నారు. ఈనెల 5న వాట్సాప్ కాల్ చేసిన కేటుగాళ్లు తాము సుప్రీంకోర్టు నియమించిన సీబీఐ అధికారులమంటూ బిల్డప్ ఇచ్చారు. మనీ లాండరింగ్ కేసులో మీ పేరు ఉందని, అరెస్ట్ చేసి జైల్లో పెడతామని బెదిరింపులకు పాల్పడ్డారు. తాము పంపే అకౌంట్ నంబర్లకు నగదు బదిలీ చేయాలంటూ.. సుమారు రూ.50లక్షలు తమ అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. మోసపోయామని గ్రహించిన మాజీ ఎమ్మెల్యే పాకాల పోలీసులను ఆశ్రయించారు.