విద్యుత్ రంగంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో విద్యుత్ రంగంలో జరిగిన పరిణామాలను వెల్లడించనున్నారు. వైసీపీ ప్రభుత్వం ప్రజలపై మోపిన భారాలు, విద్యుత్ సంస్థలు చేసిన అప్పులపైనే ప్రధానంగా వెల్లడించే అవకాశం ఉన్నట్లు సమాచారం. జగన్ ప్రభుత్వ హయాంలో విద్యుత్ రంగం అప్పులు రూ.1.12 లక్షల కోట్ల వరకు చేరుకున్నాయని అధికారులు లెక్క తేల్చిన్నట్లు సమాచారం. అదేవిధంగా రూ.18 వేల కోట్ల వరకు ప్రజలపై వివిధ భారాలు మోపారు. షిర్డీ సాయి ఎలక్ట్రానిక్స్ కేటాయించిన కాంట్రాక్టులపైనా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలియవచ్చింది.