ఎన్టీటీపీఎస్ ప్రమాదంపై సమగ్ర విచారణ చేయిస్తామని మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమా చెప్పారు. బాధితులకు అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం ఎన్నికలకు ముందు హడావుడిగా ప్రారంభం చేసిన పాపాలే ఈ దుర్ఘటనకు కారణం అని దేవినేని విరుచుకుపడ్డారు. నట్టు, బోల్టు మార్చడానికి కూడా పది రూపాయలు వెతుక్కునే పరిస్థితికి థర్మల్ పవర్ స్టేషన్‌ను గత వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పాలనలో ఐదేళ్లపాటు బూడిద దోచుకుని ఇబ్రహీంపట్నాన్ని బూడిద పట్టణంగా మార్చారని ఆయన మండిపడ్డారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏపీగా చెప్పుకునే వ్యక్తి థర్మల్ పవర్ స్టేషన్ల సీఈ స్థాయి అధికారులను శాసించాడు. క్వాలిటీ బూడిదను లోపల రాల్చుకొని సిమెంట్ ఫ్యాక్టరీలకు అమ్ముకుని కోట్లు దండుకున్నారు. గత ఐదేళ్లపాటు బూడిద ఎవరు దోచుకుతున్నారో విచారణ చేసి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మాజీ మంత్రి దేవినేని ఉమా హెచ్చరించారు.