నంద్యాల జిల్లా, ముచ్చుమర్రిలో బాలిక అదృశ్యంపై మిస్టరీ వీడింది. ఈ ఘటనలో ముగ్గురు మైనర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాలికపై అత్యాచారం చేసి ఎత్తిపోతల కాలవలో పడేసినట్లు పోలీసులు తెలిపారు. అనుమానితులు ముగ్గురు 15 ఏళ్ల లోపువారేనని తెలిపారు. నంద్యాల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారం చేసి, హత్య చేశారు. ఆదివారం తన స్నేహితులతో కలిసి పాత ముచ్చుముర్రి లోని పార్కులో ఆడుకోడానికి వెళ్లిన బాలిక అదృశ్యం అయింది. దీంతో సాయంత్రం అయినా తన బిడ్డ ఇంటికి రాకపోవడంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విషయం తెలుసుకున్న నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి.. బాలిక ఆచూకీని త్వరగా గుర్తించాలని పోలీసులను ఆదేశించారు. జూపాడుబంగ్లా, మిడుతూరు, ముచ్చుముర్రి, బ్రాహ్మణ కొట్కూరు తదితర ప్రాంతాల్లో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. గ్రామ పరిసర ప్రాంతాల్లో జాలిలం (శునకం)తో గాలించారు. జాగిలం స్థానిక ముచ్చుమర్రి పార్క్ నుంచి ఎత్తిపోతల పథకం పరిసరాల్లో తిరిగి పంపుహౌస్ వద్దకు వచ్చి ఆగిపోయింది. దీంతో అనుమానిత బాలురిని అదుపులోకి తీసుకొని విచారించగా తామే అత్యాచారం చేసి కాలువలోకి నెట్టేసినట్టు ఒప్పుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.