మలేరియా జ్వరం, డెంగీ తదితర వ్యాధులపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని నెల్లిమర్ల అర్బన్ మలేరియా అధికారి సురేష్ కోరారు. విజయనగరం జిల్లా, నెల్లిమర్ల స్థానిక జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో పలు వ్యాధుల లక్షణాలు, సంక్రమించడానికి కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి విద్యార్థినులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మలేరియా అధికారి సురేష్, ఆరోగ్య సహాయకుడు ఆరిపాక బాబూవిశ్వేశ్వరరావు తదితరులు మాట్లాడుతూ దోమలు వ్యాప్తి చెందకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో మలేరియా యూనిట్ సిబ్బంది శ్రీనివాస్, పాఠశాల ప్రధానోపాధ్యాయిని జి.ఎం శారద, పిజికల్ డైరెక్టర్ జిఎం కిషోర్ తదితరులు పాల్గొన్నారు.