గాజాలో జరిగిన దాడులపై అంతర్జాతీయ మీడియాను రిపోర్టింగ్ చేయకుండా నిషేధించిన ఇజ్రాయిల్ చర్యను ఐక్యరాజ్యసమితి ఖండించింది. ఈ సందర్భంగా యుఎన్ ప్రత్యేక ప్రతినిధి ఫ్రాన్సిస్కా అల్బనీస్ స్పందిస్తూ మీడియా నుండి ఏమి దాచాలని ఇజ్రాయెల్ చూస్తుందని ప్రశ్నించారు. ” గాజా ప్రజలపై ఇజ్రాయిల్ కొనసాగిస్తున్న మారణహోమం, హింస గురించి పాశ్చాత్య మీడియా ఇప్పుడు మౌనంగా ఉంది. ఇప్పుడు మారణహోమం, అణచివేత జరగడం లేదని చెప్పలేము’ అని ఆమె సోషల్ మీడియా వేదికగా రాశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa