ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆస్ట్రియా పర్యటనలో ఉన్నారు. ఈ క్రమంలోనే 41 ఏళ్ల తర్వాత తొలిసారి ఆస్ట్రియా గడ్డపై అడుగుపెట్టిన భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ రికార్డుల్లోకి ఎక్కారు. మంగళవారం సాయంత్రం మాస్కో నుంచి బయల్దేరిన నరేంద్ర మోదీ.. వియన్నాలో దిగారు. ఈ క్రమంలోనే వియన్నా ఎయిర్‌పోర్ట్‌లో నరేంద్ర మోదీకి ఘన స్వాగతం లభించింది. ఆస్ట్రియా విదేశాంగ మంత్రి అలెగ్జాండర్ స్కాల్లెన్ బర్గ్‌తోపాటు ఇతర అధికారులు ఆయనకు ఘనంగా స్వాగతించారు. ఈ క్రమంలోనే కొన్ని ఫోటోలను ట్విటర్ వేదికగా మోదీ పంచుకున్నారు. వియన్నాలో అడుగు పెట్టిన తనకు అద్భుతమైన స్వాగత ఏర్పాట్లు చేసినందుకు ఆస్ట్రియా ఛాన్సలర్ కార్ల్ నెమహ్మర్‌కు ధన్యవాదాలు చెప్పారు. ఈ సందర్భంగా కార్ల్ నెమహ్మర్‌తో దిగిన ఫొటోలను షేర్ చేశారు. మంగళవారం రాత్రి మోదీకి.. కార్ల్ ప్రత్యేక ఆతిథ్యం ఇచ్చారు. ఆస్ట్రియాతో భారత్‌కు దృఢమైన బంధం ఉందని.. ఆ దేశ అధ్యక్షుడు అలెగ్జాండర్ వాన్‌డర్ బెల్లెన్, ఛాన్స్‌లర్ కార్ల్ నెమహ్మర్‌తో భేటీ కానున్నట్లు తెలిపారు. అయితే చివరగా.. 1983లో అప్పటి భారత ప్రధాని ఇందిరా గాంధీ ఆస్ట్రియాలో పర్యటించారు.